20 ఏళ్ల కుర్రోడు.. రాత్రికి రాత్రి అంబానీ కంటే రిచ్ అయ్యాడు : మన ఇండియాలోనే..!

20 ఏళ్ల కుర్రోడు.. రాత్రికి రాత్రి అంబానీ కంటే రిచ్ అయ్యాడు : మన ఇండియాలోనే..!

మనందరికీ సాధారణంగా దేశంలో రిచ్ అనగానే అంబానీ, అదానీ, బిర్లాలు, టాటాల పేర్లు గుర్తొస్తుంటాయి. వాస్తవానికి వారు పెద్ద వ్యాపార దిగ్గజాలు. వారు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంటారు. అయితే వారి బ్యాంక్ ఖాతాలో ఎక్కువగానే డబ్బు ఉంటాయి. కానీ ఒక 20 ఏళ్ల కుర్రోడి బ్యాంక్ అకౌంట్లో అంబానీల కంటే ఎక్కువ ఉండటంతో రాత్రికి రాత్రే అతని పేరు వార్తల్లో నిలిచింది. 

వివరాల్లోకి వెళితే.. నోయిడాలో ఒక 20 ఏళ్ల దీపక్ తల్లి గాయత్రి దేవి మరణించింది. ఆమెకు ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.లక్ష 13వేల కోట్లు డబ్బు ఉందని తెలిసి అతడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. తాను చూస్తోంది అసలు నిజమా లేక కల అనుకున్నాడు. బ్యాంక్ పాస్ పుస్తకంలో చూపించిన 37 అంకెల బ్యాలెన్స్ లెక్కించటం కూడా రాలేదు మెుదట అతడికి. దీంతో అతను తన మిత్రులకు ఈ విషయం చెప్పాడు. తన తల్లి ఖాతాలో ఉన్న డబ్బు లెక్కించటి ఉన్న సున్నాలను చూసి షేకైపోయాడు దీపక్.

ఫోన్ లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు అంత సొమ్ము ఉండటంతో వివరాలు తెలుసుకునేందుకు తర్వాతి రోజు బ్యాంకుకు వెళ్లాడు దీపక్. అయితే ఆ ఖాతాను ప్రస్తుతం ఫ్రీజ్ చేసినట్లు బ్యాంక్ చెప్పింది. అసలు అంత పెద్ద మెుత్తంలో డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తించిన బ్యాంక్ అలర్ట్ అయ్యి విషయాన్ని పన్ను అధికారులు తెలియజేసింది. అయితే గాయత్రి దేవి బ్యాంక్ ఖాతాలోకి అంత డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరు బదిలీ చేశారు, ఎందుకు అంత డబ్బులు జమ అయ్యాయనే విషయాలపై ఆదాయపు పన్ను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదే క్రమంలో అసలు డబ్బులు ఏదైనా టెక్నికల్ గ్లిచ్ లేదా బ్యాంక్ సిబ్బంది తప్పిదం కారణంగా జరిగిందా అనే పరిశీలన కూడా జరుగుతోంది. అధికారులు ఇదొక మనీలాండరింగ్ కేసుగా భావిస్తున్నారు. మెుత్తం దర్యాప్తు తర్వాతే ఈ డబ్బులు ఎవరివి ఎక్కడి నుంచి బదిలీ అయ్యాయనే వివరాలు బయటకు రావొచ్చని చెబుతున్నారు. చాలా మంది ఇది బ్యాంక్ సిబ్బంది చేసిన క్లరికల్ ఎర్రర్ కారణంగా జరిగి ఉండొచ్చని అంటున్నారు. మెుత్తానికి 20 ఏళ్ల కుర్రోడి రాత్రికి రాత్రే అంబానీల కంటే ఎక్కువ డబ్బున్న వ్యక్తిగా మారిపోయాడంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.