- 200 మందికి 3 రోజుల జైలు.. రూ.1050 చొప్పున జరిమానా
- మిగతా వాళ్లకు పేరెంట్స్సమక్షంలో కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: గణపతి నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్బడా గణేశ్దగ్గర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 200 మందికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.1050 జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చింది. నవరాత్రుల సందర్భంగా పోకిరీల పని పట్టేందుకు ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర షీ టీమ్స్ స్పై కెమెరాలతో నిఘా పెట్టింది.
11 రోజుల పాటు రికార్డింగ్ చేయగా.. దర్శనం చేసుకోవడానికి వచ్చిన, క్యూలైన్లలో నిల్చున్న మహిళలు, యువతులతో 996 మంది అసభ్యంగా ప్రవర్తించడం రికార్డయ్యింది. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీడియో క్యాప్చరింగ్ ద్వారా 200 మందిపై నేరాన్ని నిరూపించగా, కోర్టు శిక్ష శిధించింది. మరో 796 మందికి సంబంధించిన వీడియోలు క్యాప్చర్ కాకపోవడంతో వారి తల్లిందండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.