భారత్‌కు వరల్డ్ కప్ అందించిన క్రికెటర్‌పై కేసు నమోదు

భారత్‌కు వరల్డ్ కప్ అందించిన క్రికెటర్‌పై కేసు నమోదు

భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. హిసార్‌ నివాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్‌, హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జోగిందర్‌ శర్మపై కేసు నమోదైంది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు హర్యానా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అజయ్‌వీర్, ఈశ్వర్ ప్రేమ్, రాజేంద్ర సిహాగ్‌గా గుర్తించిన మరో ఐదుగురి పేర్లు కూడా ఉన్నాయి.

హిస్సార్‌లో నివాసముంటున్న పవన్ జనవరి 1న ఆస్తి తగాదాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు పవన్ తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆస్తికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉందని చెప్పారు.జోగిందర్ శర్మతో సహా ఆరుగురు వ్యక్తులు తన కుమారుడిని వేధించారని.. అది అతని ఆత్మహత్యకు దారితీసిందని ఆమె ఆరోపించింది.నిందితులను షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. 

దక్షిణాఫ్రికా వేదికగా 2007 లో తొలి సారి ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ట్రోఫీ గెలవడంలో ఎంతో మంది కీలక పాత్ర పోషించినా.. జోగిందర్ శర్మను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. పాక్ పై జరిగిన ఫైనల్లో చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాల్సిన దశలో జోగిందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు. వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెటర్  హర్యానా డీఎస్పీగా ఉద్యోగం చేసుకుంటున్న జోగిందర్ తాజాగా ఆత్మహత్య ఆరోపణల్లో ఇరుక్కున్నాడు.