తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు..ఒడిశా క్రికెటర్‌పై బీసీసీఐ వేటు

తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు..ఒడిశా క్రికెటర్‌పై బీసీసీఐ వేటు

క్రికెటర్లను సస్పెండ్ చేయడానికి చాలానే కారణాలు ఉంటాయి. స్పాట్ ఫిక్సింగ్, నిబంధనలు అతిక్రమించడం, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చేరవేయడం మనం చూసే ఉంటాము. అయితే తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు చూపించిన కారణంగా ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మపైబీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ వేసింది. దీని ప్రకారం సుమిత్ శర్మపై వచ్చే రెండేళ్లపాటు ఎలాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడకూడదు. 

సుమీత్ 2015-16 సంవత్సరంలో జూనియర్ స్థాయిలో ఆడినప్పుడు అందించిన సర్టిఫికేట్‌లు.. ప్రస్తుత సీజన్‌లో అందించిన  సర్టిఫికేట్‌లు భిన్నంగా ఉన్నాయని OCA కార్యదర్శి సంజయ్ బెహెరా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 2023-24 రంజీ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఒడిశా క్రికెట్ జట్టులో శర్మ సభ్యుడు. సుమిత్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకొని అతడిని బ్యాన్ చేయడంతో అతని స్థానంలో ఒడిశా క్రికెట్ సెలక్షన్ కమిటీ తారిణి సాను ఎంపిక చేసింది.

ఈ విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించాలని గతంలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. కాగా.. నేటి నుంచి (జనవరి 5) రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. మోతీ బాగ్ స్టేడియంలో బరోడాతో ఒడిశా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.