టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ టోర్నీ తర్వాత అత్యంత ఆసక్తికర టోర్నీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 9 నుంచి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ స్టార్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నవంబర్ 9న టురిన్‌లో ప్రారంభమై నవంబర్ 16న జరిగే ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌తో ముగుస్తుంది. సంవత్సరం చివర్లో జరగనున్న ఈ టోర్నీలో ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఉన్న టాప్-8 ప్లేయర్స్ ఆడనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా జనిక్ సిన్నర్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాడు. జొకోవిచ్, అల్కరాజ్ ఇద్దరూ ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం.
ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌ను కలిగి ఉంటుంది. సింగిల్స్ ఆడే 8 మంది ప్లేయర్లను రెండు గ్రూప్ లుగా విభజిస్తారు. గ్రూప్-ఏ లో నలుగురు ప్లేయర్స్.. గ్రూప్-బి లో నాలుగు ప్లేయర్స్ ఉంటారు. తమ గ్రూప్ లోని నలుగురు ప్లేయర్స్ ఇతర ఆటగాళ్లతో ఒక్కో మ్యాచ్ లో తలపడతారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 లో నిలిచిన ప్లేయర్స్ సెమీస్ కు చేరతారు. సెమీస్ లో గెలిచిన ఆటగాళ్లు టైటిల్ కోసం ఫైనల్లో ఆడతారు.
పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ సీజన్‌కు ముగింపు పలికే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ 1970లో 'మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్' (Masters Grand Prix) పేరుతో టోక్యోలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP) ద్వారా నిర్వహించబడుతుంది. సీజన్ మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రపంచంలోని టాప్-8 సింగిల్స్ ఆటగాళ్ళు ఇందులో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.
బ్జోర్న్ బోర్గ్ గ్రూప్
సింగిల్స్: సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్, బెన్ షెల్టాన్, లోరెంజో ముసెట్టి లేదా ఫెలిక్స్ అగర్-అలియాస్సిమ్.
జిమ్మీ కానర్స్ గ్రూప్:
సింగిల్స్: కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్, టేలర్ ఫ్రిట్జ్, అలెక్స్ డి మినార్
