హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా లూప్ లైన్ లో ఉన్న డీఎస్పీలతో పాటు పలు కీలక డివిజన్లలో పనిచేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసి.. పోస్టింగ్ ఇచ్చారు.
మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న శివధర్ రెడ్డి.. పోలీసులకు పుట్టినరోజు, పెళ్లి రోజు సెలవులు ఇవ్వడంతో పాటు భారీగా ట్రాన్స్ఫర్ చేయడం డిపార్ట్మెంట్లో చర్చినీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మరికొన్ని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా డీజీపీగా శివధర్ రెడ్డి తన మార్క్ చూపించుకుంటున్నారని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

