తెలంగాణ షూటర్లకు 22 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెలంగాణ షూటర్లకు 22 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : సౌత్ జోన్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ షూటర్లు సత్తా చాటారు. గచ్చిబౌలిలోని శాట్ షూటింగ్ రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వివిధ ఈవెంట్లలో మొత్తం 22 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించారు. 

ఇందులో 11 గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 6 సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.  స్టార్ షూటర్ కైనన్ చెనాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్రాప్ లో (117+45 స్కోరు) గోల్డ్ నెగ్గాడు. ఫజల్ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్ ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో, ప్రభాకర్ చౌదరి స్కీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.