
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కొత్త కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,489గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,125 మంది చనిపోయారు.