రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థిపై 242 కేసులు

రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థిపై 242 కేసులు

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈసీ నిబంధనల మేరకు ఆయన తనపై ఉన్న కేసుల వివరాలను 3 పేజీల్లో వెల్లడించారు. అలాగే ఎర్నాకులం బరిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్‌పై 211 కేసులు ఉన్నాయి. 

వీటిలో ఎక్కువ కేసులు 2018 శబరిమల ఆందోళనల్లో నమోదైనవే కావడం గమనార్హం. వీటిలో చాలా వరకు ప్రస్తుతం విచారణ దశలోనే ఉన్నాయి. ఎక్కడైనా నిరసనలు చోటు చేసుకున్నప్పుడు  దాంతో సంబంధం ఉందని భావించిన వారిపైనా కేసులు నమోదు చేశారని, ఈ క్రమంలోనే వీరిపై కేసులు ఎక్కువయ్యాయని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్ తెలిపారు.  

Also Read:కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోంది

రాధాకృష్ణన్‌పై శబరిమల నిరసనలకు సంబంధించి 237 కేసులు నమోదు కాగా కేరళలో వివిధ ఆందోళనలకు సంబంధించి ఐదు కేసులు నమోదయ్యాయని కురియన్ తెలిపారు.  శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు స్థానిక ప్రభుత్వం ముందుకు రావడంతో తీవ్ర స్థాయిలో అందోళనలు రేగిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాహుల్ గాంధీ ఇంకా తన కేసుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 4. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8.