హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో భారీగానే సీట్లు భర్తీ అయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి ఉన్న 34,558 మేనేజ్మెంట్ కోటా సీట్లలో.. ఏకంగా 25,029 సీట్లు (72.4 శాతం) నిండాయి. విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేందుకే మొగ్గు చూపారు. స్టేట్లో మొత్తం 1,20,437 బీటెక్ ఫస్టియర్లో సీట్లు ఉన్నాయి.
వీటిలో బీ కేటగిరీలో 34,558 సీట్లు పెట్టారు. వీటిలో అత్యధికంగా మార్కెట్ అవసరాలు, సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాల దృష్ట్యా ఈసారి కూడా విద్యార్థులు సీఎస్ఈ, అలైడ్ బ్రాంచీల వైపే ఆసక్తి చూపించారు.
