
హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్ల కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
చర్లపల్లి– శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రతి మంగళవారం నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి జూన్ 24వ వరకు(7సర్వీసులు), శ్రీకాకుళం రోడ్– చర్లపల్లి మధ్య ప్రతి బుధవారం నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి జూన్25 వరకు(7సర్వీసులు)నడుస్తాయని తెలిపారు. చర్లపల్లి– శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రతి సోమవారం నడిచే రైలు ఈనెల 12 నుంచి జూన్ 23 వరకు(6 సర్వీసులు), శ్రీకాకుళం రోడ్– చర్లపల్లి మధ్య ప్రతి సోమవారం నడిచే రైలును ఈ నెల 12 నుంచి జూన్23వ తేదీ వరకు(6 సర్వీసులు) నడుపుతున్నట్లువెల్లడించారు.
వీక్లీ స్పెషల్ రైళ్ల పొడిగింపు
వీక్లీ స్పెషల్రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. సంత్రాగచి– యశ్వంత్పూర్మధ్య ప్రతి గురువారం నడిచే రైలును ఈ నెల 22వ తేదీ నుంచి జూన్26 వరకు పొడిగించారు. యశ్వంత్పూర్– సంత్రాగచి మధ్య ప్రతి శనివారం నడిచే రైలును ఈనెల 24 నుంచి జూన్28వ తేదీ వరకు పొడిగించినట్టు చెప్పారు. షాలిమార్– చెన్నై సెంట్రల్ మధ్య ప్రతి సోమవారం నడిచే రైలును ఈ నెల19 నుంచి జూన్30వ తేదీ వరకు పొడిగించారు. చెనై సెంట్రల్– షాలిమార్మధ్య ప్రతి బుధవారం నడిచే ప్రత్యేక రైలును ఈ నెల 21వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు పొడిగించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.