అగ్నిప్రమాదంలో 27 మంది సజీవదహనం

అగ్నిప్రమాదంలో 27 మంది సజీవదహనం

జపాన్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 8 అంతస్థుల భవనంలోని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భవనంలోని నాలుగో అంతస్థులో మంటలు చెలరేగాయి. అయితే వాణిజ్య సముదాయినికి సంబంధించిన భవనం కావడంతో 27మంది మృతి చెందారు.  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో  20 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భవనంలోని 4వ అంతస్తు నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి.. సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 70ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.  ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి ఇంకా కారణాలు తెలియలేదు. 

ఇవికూడా చదవండి:

రేప్ ఎంజాయ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్