IND Vs WI రెండో వన్డే: టాస్ గెలిచిన విండీస్

IND Vs WI  రెండో వన్డే: టాస్ గెలిచిన విండీస్

పోర్ట్​ ఆఫ్​ స్పెయిన్​ (ట్రినిడాడ్): మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే  మొదలైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. విండీస్‌ మాత్రం గెలిచి నిలబడాలని ప్రయత్నిస్తోంది. టీమిండియా తరపున ఆవేశ్‌ ఖాన్‌ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఐదుగురు స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్‌ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్‌ పర్యటనలో వరుసగా రెండో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.

సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్‌ అప్పగించిన వెస్టిండీస్‌ మరో సిరీస్‌ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తిగా ఉండనుంది.  గత మ్యాచ్​లో  ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం పెంచే విషయమే. నాణ్యమైన బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కొని 300 స్కోరు చేసిన కరీబియన్లను ఇండియన్స్​తక్కువగా అంచనా వేయడానికి లేదు. 

టీమిండియాలో  అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్ తొలి వన్డేలో  నిరాశ పరిచాడు. జట్టులో ప్రతీ చోటుకు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో  బ్యాట్ ఝుళిపించకపోతే ఇతరులకు తను దారి వదలాల్సి ఉంటుంది. రెండో మ్యాచ్​లో సంజూతో పాటు సూర్యకుమార్​, దీపక్​ హుడా, అక్షర్​ పటేల్​పై కూడా ఫోకస్​ ఉంది. జడేజా గైర్హాజరీలో హుడాను ధవన్​ పార్ట్​టైమ్ స్పిన్నర్​ గా ఉపయోగించుకున్నాడు. చహల్​ కంటే ముందే బౌలింగ్​కు వచ్చిన హుడా వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్​ చేసి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్​లో సిరాజ్, శార్దూల్​, చహల్​ సత్తా చాటినప్పటికీ.. విండీస్​ 300 స్కోరు చేసిందంటే మన బౌలింగ్​లో లోపాలు ఉన్నట్టే. వాటిని సరిదిద్దుకొవాల్సి ఉంటుంది. 

టీమ్స్ వివరాలు

https://twitter.com/BCCI/status/1551192591068446720

ttps://twitter.com/BCCI/status/1551192574378930177