Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

పాపం.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు ప్రస్తుతం  బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గత కొన్నేళ్లుగా ఆయన నుండి వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కారణం.. తనను గీత గోవిందం లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించడం. కానీ, ఈసారి కూడా విజయ్ కి హిట్టు వరించలేదు. 

ఇదిలా ఉంటే.. ది ఫ్యామిలీ స్టార్ ప్లాప్ నుండి ఈ మధ్యే కోలుకున్న విజయ్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాలపై దృష్టిపెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. అవును.. రాజా వారు రాణి గారు సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలాతో సినిమా చేయనున్నాడట విజయ్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

అయితే.. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. పాన్ ఇండియా లెవల్లో  పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి విజయ్ కొత్త సినిమా టైటిల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.