గుజరాత్ లో ఒకే రోజు ముగ్గురు సీఎంల ర్యాలీలు

గుజరాత్ లో ఒకే రోజు ముగ్గురు సీఎంల ర్యాలీలు

గుజరాత్ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  కాకుండానే పొలిటికల్ హీట్ నెలకొంది. పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ  మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లు వివిధ ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

భావ్‌నగర్‌లోని పాలిటానా పట్టణం, రాజ్‌కోట్ జిల్లాలోని ధోరాజీలో రెండు ర్యాలీలలో కేజ్రీ, మాన్ లు ప్రసంగించనున్నారు. శుక్రవారం నుంచి గుజరాత్ లో అరవింద్ కేజ్రీవాల్ పర్యటిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో ఆప్ అడుగులు వేస్తోంది.అందులో భాగంగా ప్రజలకు పలు హామీలిస్తున్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఇవాళ మూడు ర్యాలీలలో ప్రసంగించనున్నారు. తొలుత బనస్కాంతలోని విరాంపూర్‌లో జరిగే బహిరంగ సభలో గెహ్లాట్ పాల్గొననున్నారు. సబర్‌కాంత జిల్లాలోని ఖేద్‌బ్రహ్మ, ఆరావళి జిల్లాలోని భిలోడాలో జరిగే ర్యాలీలకు హాజరవుతారు. పార్టీలకు విరాళాలు అందించడానికి దాతలు భయపడుతున్నారని, 95 శాతం ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ విరాళాలు పొందుతోందని విమర్శించారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే కార్పొరేట్‌లను బీజేపీ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు.