3 రోజుల ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

3 రోజుల ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
  • అమరులైన ఐదుగురు జవాన్లు.. ఒక పౌరుడి మృతి

శ్రీనగర్: అది మార్చి 1న తెల్లవారుజాము సమయం.. జమ్ము కశ్మీర్లోని కుప్వారా జిల్లా హండ్వారా గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని బలగాలకు సమాచారం అందింది. వెంటనే సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. శుక్రవారం ఉదయం మొదలైన ముష్కర వేట… మూడు రోజుల పాటు సాగింది. ఈ రోజు మధ్యాహ్నం ముగిసింది. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. దురదృష్టవశాత్తు ఐదురుగు జవాన్లు అమరులయ్యారు.  వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు జమ్ము కశ్మీర్ పోలీసులు ఉన్నారు. ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

చనిపోయినట్లు నటించిన ఉగ్రవాది.. నలుగురు జవాన్ల ప్రాణాలు తీశాడు

శుక్రవారం ఉదయం ముష్కర వేటలో దిగారు జవాన్లు. హండ్వారాలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన బలగాలపైకి.. రెండు ఇళ్లలో నక్కి కాల్పులకు దిగారు టెర్రరిస్టులు. దీటుగా తిప్పికొట్టారు జవాన్లు. వారిని ఎదుర్కోలేకపోయిన ఉగ్రవాదులు కప పన్నాగానికి దిగారు. ఒక్కసారిగా ఓ ఇంట్లో నుంచి కాల్పులు ఆగిపోయాయి. దీంతో ఉగ్రవాది హతమయ్యాడని భావించి.. జవాన్లు లోపలికెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించాలని దగ్గరకు వెళ్లగానే.. ఆ టెర్రరిస్ట్ కాల్పులు జరిపాడు. దీంతో నాలుగు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో మరో జవాను మరణించారు. ఆ తర్వాత అదనపు బలగాలు రంగంలోకి దిగారు. ఆ రెండు ఇళ్లను పేల్చేశారు. దీంతో ఉగ్రవాదులు హతమయ్యారు.