నిరసనకారులపైకి ఆర్మీ కారు.. ముగ్గురు మృతి

నిరసనకారులపైకి ఆర్మీ కారు.. ముగ్గురు మృతి

బ్యాంకాక్: మయన్మార్​లో మిలిటరీ సర్కారుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేసేందుకు ఆర్మీ జవాన్లు, పోలీసులు ఇంకా అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆదివారం యాంగన్ సిటీలో ర్యాలీ చేస్తున్న నిరసనకారులను ఆర్మీ సోల్జర్లు ఓ కారులో వెనక నుంచి వచ్చి తొక్కించారు. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కిడే చనిపోగా, చాలామంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కారులో నుంచి దిగిన ఐదారుగురు సోల్జర్లు కాల్పులు జరిపారని, పారిపోతున్న వారిని వెంటాడారని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 1న సూకీ ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. ఆమెపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో ఒకదాంట్లో సోమవారం తీర్పు రానుండగా ఈ సంఘటన జరిగింది. నిరసనల్లో ఇప్పటివరకు 1300 మందిని ఆర్మీ, పోలీసులు చంపి ఉంటారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.