తిరుగుబాటు ఆరోపణలతో సౌదీ యువరాజుల అరెస్టు

తిరుగుబాటు ఆరోపణలతో సౌదీ యువరాజుల అరెస్టు

క్రౌన్​ ప్రిన్స్ మహ్మద్​ బిన్​ సల్మాన్​ను పదవి నుంచి దించేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో సౌదీ అధికారులు ముగ్గురు యువరాజులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సల్మాన్​ సోదరుడు ప్రిన్స్ అహ్మద్​ బిన్​ అబ్దులాజిజ్​ అల్​సౌద్ తో పాటు మేనల్లుడు ప్రిన్స్​ మహ్మద్​ బిన్​ నయీఫ్​ కూడా ఉన్నారు. ప్రిన్స్ నయీఫ్​ సోదరుడు ప్రిన్స్ నవాఫ్​ బిన్​ నయీఫ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బ్లాక్​ లాడ్​ రాయల్​ గార్డ్స్​ శుక్రవారం ఈ ముగ్గురి ఇండ్లకు వెళ్లి, వారిని తీసుకెళ్లినట్లు అమెరికన్ పేపర్​ వార్త రాసింది. దీనిపై స్పందించేందుకు సౌదీ అధికారులు నిరాకరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో ఇస్లాం పవిత్ర స్థలాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్యపై క్రౌన్​ ప్రిన్స్​ ఆంక్షలు విధించారు. వైరస్​నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇది వివాదాస్పదంగా మారింది. దేశవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే రాజకుటుంబంలో తిరుగుబాటు కుట్ర బయటపడడం, ముగ్గురు యువరాజుల అరెస్టు జరగడం సౌదీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్టైన వారిలో ఇద్దరు యువరాజులు ఒకప్పుడు సింహాసనం కోసం పోటీపడిన వారేనని సౌదీ రాయల్​ కోర్టు పేర్కొంది. క్రౌన్​ ప్రిన్స్ పై తిరుగుబాటు ఆరోపణలు రాయల్​ కోర్టులో రుజువైతే.. ముగ్గురు యువరాజులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.