లక్నో కొత్త కెప్టెన్ ఎవరంటే?.. రేసులో ముంబై సారథి, మార్క్రమ్, మిచెల్ మార్ష్!

లక్నో కొత్త కెప్టెన్ ఎవరంటే?.. రేసులో ముంబై సారథి, మార్క్రమ్, మిచెల్ మార్ష్!

Lucknow Super Giants: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్సీకి రిషభ్ పంత్ రిజైన్ చేయడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో పంత్ తప్పుకోగా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ఇప్పుడు టీమ్‌ను రీబిల్డ్ చేసే పనిలో పడ్డారు. ఓనర్ సంజీవ్ గోయెంకా మైండ్‌సెట్‌కు తగ్గట్టు, హై-ప్రెజర్ సిట్యుయేషన్స్‌ను హ్యాండిల్ చేసే ఆ కొత్త లీడర్ ఎవరు అనేదానిపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతుంది. 

లక్నో బిగ్గెస్ట్ స్కెచ్?: 
* హార్దిక్ పాండ్యా:
ప్రస్తుతం వినిపిస్తున్న అత్యంత క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడాలని డిసైడ్ అయ్యాడట.. ఈ సీజన్‌లో ముంబై 9వ స్థానంతో సరిపెట్టుకోవడంతో మెంటల్‌గా బాగా అలసిపోయిన హార్దిక్, టీమ్ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తుంది.

ఎందుకు బెస్ట్ ఛాయిస్?: హార్దిక్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్.. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు కప్పు అందించడమే కాదు, 2023లో రన్నరప్‌గా నిలిపాడు. లక్నో గనుక ట్రేడింగ్ లేదా విండో ద్వారా హార్దిక్‌ను తీసుకుంటే.. సంజీవ్ గోయెంకా ఆశించే అగ్రెసివ్, నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్ లక్నోకు దొరికినట్లే!

రెడీమేడ్ ఇంటర్నేషనల్ కెప్టెన్: 
ఐడెన్ మార్క్‌రమ్:
విదేశీ ప్లేయర్స్ వైపు చూడకుండా టీమ్‌లో ఉన్నవారినే కెప్టెన్ చేయాలనుకుంటే సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ టాప్ లిస్ట్‌లో ఉంటాడు. రూ.2 కోట్లకు లక్నో కొనుగోలు చేసిన మార్క్రమ్‌కు టాక్టికల్ గా మంచి రికార్డ్ ఉంది.

ఎందుకు బెస్ట్ ఛాయిస్?: మార్క్‌రమ్ ఆల్రెడీ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గా, గతంలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా పని చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా RPSG బ్యానర్ (లక్నో ఓనర్స్) కింద ఎస్ఏ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌గా నిలిపిన హిస్టరీ అతనికుంది. పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీజన్ ఎండ్‌లో లక్నో క్యాంప్‌ను కాస్త త్వరగా వీడినా.. జట్టుని నడపడానికి ఇతను ఒక సేఫ్ అండ్ కూల్ ఆప్షన్.

ఫ్రంట్ నుంచి లీడ్ చేసే బైసన్: 
మిచెల్ మార్ష్:
లక్నో టీమ్ మొత్తం మునిగిపోతున్నా.. ఒంటరి పోరాటం చేస్తూ ఈ సీజన్‌లో వన్-మ్యాన్ షో చూపించిన ప్లేయర్ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్.

ఎందుకు బెస్ట్ ఛాయిస్?: ఈ సీజన్‌లో మార్ష్ బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్ కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 163.18 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 563 రన్స్ బాదాడు. ఇందులో రెండు మెరుపు సెంచరీలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా వంటి వరల్డ్ క్లాస్ టీమ్‌ను లీడ్ చేస్తున్న మార్ష్‌కు లక్నో ఫుల్-టైమ్ కెప్టెన్సీ ఇస్తే.. లక్నో ఆశించే ఫియర్-లెస్ క్రికెట్ కల్చర్ టీమ్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.