అనంత్ నాగ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అనంత్ నాగ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ: అనంతనాగ్ కొండ ప్రాంతంలో ఉగ్రవాదులకోసం భద్రతాదళాలు నాలుగో రోజు గాలిస్తుండగా.. ఉగ్రవాదులకు, భద్రతా దళాకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కోకెర్‌నాగ్‌లోని కొండ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతాదళాలు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కొండ ప్రాంతంలో దాక్కున్నారన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతాదళాలు. 

అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గాడోల్ అడవుల పర్వతాలలో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారంతో భద్రతా దళాలు డ్రోన్ లను ఉపయోగించి వారి కదలికలను ట్రాక్ చేశాయి. గాడోల్ అడవుల్లోని కొండ ప్రాంతంలోని 10-15 అడుగుల పొడవైన గుహలో ఉగ్రవాదులు దాక్కున్నారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించాయి భద్రతాదళాలు.