
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్లల్లో తమ ప్రభుత్వం 47 బిలియన్డాలర్ల పెట్టుబడులు సాధించిందని, తద్వారా 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ట్రేడ్ప్రమోషన్కార్పొరేషన్చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మఠం భిక్షపతిని ఆమె అభినందించి మాట్లాడారు.
ఇండస్ట్రీస్సెక్టార్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ట్రేడ్కార్పొరేషన్ఆదాయం రూ.30 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.130 కోట్ల లాభాలకు ఎదిగిందని కవిత తెలిపారు.
భిక్షపతితో పాటు స్టేట్వేర్హౌసింగ్కార్పొరేషన్చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఉద్యమకారుడు సాయిచంద్సతీమణి రజని, స్టేట్ఇండస్ట్రీయల్డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్తన్వీర్ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు అభినందించారు.