శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 300 మద్యం బాటిళ్లు స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 300 మద్యం బాటిళ్లు స్వాధీనం

ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 80కి పైగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గోవా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి విమానంలో హైదరాబాద్ కు మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు వాటిని గుర్తించి సీజ్ చేశారు. ఇతర రాష్ట్రల నుంచి దుండగులు మద్యం సరఫరా చేస్తే.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం వాటిల్లుతదని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరానికి సంబంధించిన ప్రధాన నిందితులను పట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.