
న్యూఢిల్లీ: మైగేట్ సంస్థ వచ్చే కొన్ని నెలల్లో 300 మందిని నియమించుకోవాలని చూస్తోంది. టెక్నాలజీ, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ రోల్స్‌లో కొత్త వారి నియామకం ఉంటుందని పేర్కొంది. దేశంలో తమ పొజిషన్‌ను బలోపేతం చేసేందుకు చూస్తున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీస్ లో సెక్యూరిటీని నిర్వహిస్తోంది. అలాగే మాన్యువల్ టాస్క్‌లను డిజిటైజ్ చేసేందుకు సాయపడుతోంది. ప్రస్తుతం 10 వేల రెసిడెన్-షియల్ కాంప్లెక్స్‌లలో ఇది తన సేవలందిస్తోంది. మెజార్టీ కమ్యూనిటీస్ లో బెంగళూరు, హైదరాబాద్, ఎన్‌సీఆర్, ముం బై, పూణే వంటి ఆరు రీజియన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి 25 వేల కాంప్లె క్స్‌లకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. మైగేట్‌లో ప్రస్తుతం 1,150 మంది ఉద్యోగులున్నారు. 2016లో ఈ కంపెనీ ఏర్పాటైంది. గతేడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్, అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్, జేఎస్ క్యాపి టల్ మేనేజ్‌మెంట్, ప్రస్తుత ఇన్వెస్టర్ ప్రైమ్ వెం చర్స్ పార్టనర్స్ నుంచి 56 మిలియన్ డాలర్లను సేకరించింది.