
- మహారాష్ట్రలో ఫుడ్ పాయిజన్ అయి 300 మంది బేహోష్
ముంబై : మహారాష్ట్రలో ఒక మతపరమైన కార్యక్రమంలో ఫుడ్ తిన్న దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. అంతమందికి ఒకే సారి ట్రీట్మెంట్ అందజేసేందుకు సరిపడా బెడ్లు లేకపోవడంతో హాస్పిటల్ ఆవరణలో వారిని నేలపై పడుకోబెట్టి చెట్ల మధ్య తాళ్లు కట్టి వాటికి సెలైన్ బాటిళ్లు వేలాడదీని చికిత్స అందించారు. ఒక దండెలా సెలైన్ బాటిళ్లు వేలాడుతున్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మహారాష్ట్రలోని బుల్దానాలో ఒక మతపరమైన కార్యక్రమం వారం రోజులు నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం అక్కడ అందజేసిన ఫుడ్ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 300 మంది బేహోష్ అయ్యారు.
ట్రీట్మెంట్ కోసం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బెడ్లు సరిపోక చాలామందిని ఆవరణలో నేలపై పడుకోబెట్టారు. అక్కడున్న చెట్ల మధ్య తాళ్లు కట్టి వాటికి సెలైన్ బాటిళ్లు వేలాడదీసి బాధితులకు ఎక్కించారు. అయితే అస్వస్థతకు గురైన వారిని ట్రీట్మెంట్ కోసం దవాఖానకు తీసుకొచ్చినప్పుడు అక్కడ డాక్టర్లు ఎవరూ లేరని బాధితులు కుటుంబ సభ్యులు, బంధులువు చెప్తున్నారు. గ్రామస్థుల సాయంతో ప్రైవేటు వైద్యులను పిలిపించాల్సి వచ్చిందని తెలిపారు. బాధితుల్లో 30 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.