గణేష్ నిమజ్జనానికి జంట నగరాల్లో 32 ఘాట్స్

గణేష్ నిమజ్జనానికి జంట నగరాల్లో 32 ఘాట్స్

హైదరాబాద్  జంట నగరాలలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందర్ని ఆకర్షించే ఖైరాతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ లు ఖైరతాబాద్ వినాయకుడి ఏర్పాట్లను ఇవాళ పరిశీలించారు. పటిష్ట  పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామన్నారు. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి రానుండటంతో ట్రాఫిక్‌ మళ్లింపు చేపడతామన్నారు. కరెంట్‌ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.  హుస్సేన్‌సాగర్‌ లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు. నగరంలోని వినాయకుల నిమజ్జనం కోసం 32 ఘాట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.