రూ.9.6 కోట్ల బాండ్లు ఎక్స్​పైర్డ్

రూ.9.6 కోట్ల బాండ్లు ఎక్స్​పైర్డ్
  • లిస్ట్​లో ఫ్యూచర్​ గేమింగ్ అండ్​ హోటల్​ సర్వీసెస్ పీఆర్​​ టాప్​
  • ఆ తర్వాతి స్థానంలో ఈసీఎల్​ ఫైనాన్స్​ లిమిటెడ్​

న్యూఢిల్లీ: వివిధ రాజకీయ పార్టీల కోసం 33 సంస్థలు ఏప్రిల్​ 2019 నుంచి జనవరి 2024 వరకు కొనుగోలు చేసిన రూ. 9.6 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్ల ఎక్స్​పైర్డ్​ అయ్యాయి.  ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా ప్రచురించిన డేటా ప్రకారం ఈ లిస్ట్​లో ఫ్యూచర్​ గేమింగ్ అండ్​ హోటల్​సర్వీసెస్​ పీఆర్​సంస్థ టాప్​లో నిలిచింది. ఆ తర్వాత ఈసీఎల్​ ఫైనాన్స్​ లిమిటెడ్​, పసిఫికా ఇండియా ప్రాజెక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​, ఎడెల్విస్​ రూరల్​ కార్పొరేట్​ సర్వీస్​ ఉన్నాయి. 

ఈ నాలుగు సంస్థలు కలిసి గడువు తీరిపోయిన బాండ్లలో 72.3 శాతం కొనుగోలు చేశాయి.  అలాగే, 15 మంది వ్యక్తులు కొన్న రూ. వెయ్యి నుంచి రూ.25వేల విలువ చేసే బాండ్లు ఎక్స్​పైర్డ్​ అయ్యాయి. మరో ఆరు సంస్థలు కొనుగోలు చేసిన రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల విలువ చేసే బాండ్లు ఎన్​క్యాష్​ కాలేదు. ఎనిమిది కంపెనీలు కొన్న మిలియన్​ నుంచి 5 మిలియన్ల విలువైన బాండ్ల గడువుకూడా ముగిసిపోయినట్టు ఎలక్షన్​ కమిషన్​ డేటా వెల్లడించింది.  కాగా, బాండ్ల గడువు తీరిపోవడంతో ఈ డబ్బులన్నీ ప్రధానమంత్రి సహాయనిధి (పీఎం రిలీఫ్​ ఫండ్​)కి చేరాయి.