
న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో పాల్గొనే క్రికెటర్ల షార్ట్ లిస్ట్‌ను నిర్వాహకులు ప్రకటించారు. మొదటగా ఉన్న 971 మంది జాబితాను 332కు కుదించారు. ఫైనల్ లిస్ట్‌ను ఎనిమిది ఫ్రాంచైజీలకు పంపించారు. ఈనెల 19న కోల్‌కతాలో ఈ వేలం జరుగనుంది. ఈ లిస్ట్‌లో 19 ఇండియన్ క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు 24 మంది కొత్త వారికి చోటు కల్పించినట్లు సమాచారం.
కెస్రిక్ విలియమ్స్ (విండీస్), ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్), ఆడమ్ జంపా (ఆసీస్), 21 ఏళ్ల సర్రే బ్యాట్స్‌మన్ విల్ జాక్స్‌తో పాటు మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ ఇందులో ఉన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 73 మందిని తీసుకునే చాన్స్ ఉంది. ఇందులో 29 విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయిన జైదేవ్ ఉనాద్కట్.. ఈసారి బేస్‌ప్రైస్‌ను కోటి రూపాయలకు తగ్గించుకున్నాడు.