36 శాతం రాజ్యసభ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

36 శాతం  రాజ్యసభ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

న్యూఢిల్లీ: రాజ్యసభ అభ్యర్థుల్లో 36 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. దేశవ్యాప్తంగా15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం 59 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 58 మంది ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి ఏడీఆర్ ఈ అంశం వెల్లడించింది. 17 శాతం మంది అభ్యర్థులు తమపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. 

ఒక అభ్యర్థి తనపై హత్యాయత్నానికి సంబంధించిన కేసు ఉన్నట్టు వెల్లడించారు. 30 మంది బీజేపీ అభ్యర్థుల్లో 8 మంది, 9 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో  ఆరుగురు, ముగ్గురు వైఎస్సార్‌‌సీపీ అభ్యర్థుల్లో ఒకరు, బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఒకరిపై క్రిమినల్ కేసు ఉందని ఏడీఆర్​ వెల్లడించింది.