ఫస్టియర్ రీవెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తుకు ముగిసిన గడువు

ఫస్టియర్ రీవెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తుకు ముగిసిన గడువు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఆన్సర్ షీట్ల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఇంటర్ బోర్డు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. రీవెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు 36,263 మంది రీకౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు 3,841 మంది స్టూడెంట్లు అప్లై చేసుకున్నారు. ఫలితాలపై గందరగోళం నెలకొనడంతో, ఫెయిలైన వారిని ప్రభుత్వం పాస్ చేస్తుందనే ఆశతో చాలామంది స్టూడెంట్లు అప్లై చేసుకోలేదు. ఈనెల 16న రిజల్ట్ ప్రకటించిన బోర్డు.. రీకౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు, రీవెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు ఆరు రోజులు మాత్రమే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ యూనియన్ల ఆందోళనల నేపథ్యంలో ఒక్కో సబ్జెక్టు రీవెరిఫికేషన్​ఫీజును రూ.600 నుంచి రూ.300కు తగ్గించారు. అయితే రిజల్ట్‌‌‌‌‌‌‌‌పై అనేక అనుమానాలున్నాయని, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫ్రీగా చేయాలని, అప్లై చేసుకునేందుకు మరో వారం రోజులు గడువును పొడిగించాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 

ఇంటర్ రిజల్ట్స్ ఇష్యూపై 12 గంటల్లోగా చెప్పాలె
లేకపోతే బోర్డు వద్ద దీక్ష చేస్త: జగ్గారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ రిజల్ట్స్ ఇష్యూపై 12 గంటల్లోగా సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఇంటర్ బోర్డు వద్ద గురువారం దీక్ష చేస్తానని ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్లందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల స్టూడెంట్లు సరిగా చదవలేకపోయారని, దీంతో చాలా మంది ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేపట్టే దీక్షకు పార్టీలు, స్టూడెంట్ యూనియన్ల లీడర్లు ఎవరూ రావొద్దన్నారు.