
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 2023 నవంబర్ 16 గురువారం రోజున భూకంపం సంభవించింది. ఉదయం 9.34 గంటలకు డోడాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
ఇదిలా ఉండగా దోడా జిల్లాలోని భదర్వా బెల్ట్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో కనీసం ఎనిమిది భవనాలు దగ్ధమయ్యాయి. చిన్నోట్ ప్రాంతంలోని భాదర్‌వాలో తెల్లవారుజామున 4.45 గంటలకు షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి.
Also Read :- తుఫాన్ మిధిలీ ఎక్కడ ఉంది.. ఎటు వైపు వెళుతుంది.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా..?