ఆస్పత్రిలోనే.. చుట్టూ డాక్టర్ల మధ్యనే.. కార్డియాక్ అరెస్ట్ నుంచి ఈ డాక్టర్ను ఎందుకు కాపాడలేకపోయారు..?

ఆస్పత్రిలోనే.. చుట్టూ డాక్టర్ల మధ్యనే.. కార్డియాక్ అరెస్ట్ నుంచి ఈ డాక్టర్ను ఎందుకు కాపాడలేకపోయారు..?

కార్డియాక్ అరెస్ట్. ఒక్కసారిగా గుండె.. రక్త సరఫరాను ఆపేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ అందదు. అప్పుడు మనిషి ఒక్కసారిగా కుప్పకూలి, ఊపిరాడక సోయి కోల్పోతాడు. గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్​ అంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురై తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఒక కార్డియాక్ సర్జన్ చనిపోయిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన ఆ డాక్టర్ పేరు గ్రాడ్లిన్ రాయ్. వయసు 39 సంవత్సరాలు.

దురదృష్టమైన విషయం ఏంటంటే.. సదరు డాక్టర్ పేషంట్స్ను విజిట్ చేస్తూ రౌండ్స్లో ఉండగా ఈ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. తోటి వైద్యులు తక్షణమే స్పందించి అతని ప్రాణాలు కాపాడటానికి ఎంతో ప్రయత్నించారు. అయినప్పటికీ ఈ యువ వైద్యుడిని కాపాడలేకపోయారు. డాక్టర్లు ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. తినే ఫుడ్ విషయంలో, వ్యాయామం విషయంలో.. ఇలా ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వైద్యులే కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోవడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

డాక్టర్ల ప్రాణాలకే కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు ముప్పు ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. డాక్టర్లకు ఇలా హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు కొందరు వైద్యులు పలు కారణాలను ప్రముఖంగా ఏడు కారణాలను ప్రస్తావించారు. వీటిల్లో ప్రముఖంగా చెబుతున్న కారణం.. ఎక్కువ పని గంటలు. శరీరం సహకరించే సమయం కంటే ఎక్కువగా డ్యూటీ చేయాల్సి రావడం ప్రధాన సమస్యగా మారిందని వైద్యులు చెబుతున్నారు.

ఈ కారణంగా వైద్యుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించిన ఒత్తిడి, గంటల కొద్దీ OTలో (ఆపరేషన్ థియేటర్) గడపాల్సి రావడం.. ఆన్ కాల్ డ్యూటీస్ కారణంగా వ్యాయామం చేసేందుకు సమయం లేకపోవడం, టైంకు తినకపోవడం.. హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్, ఎక్కువగా కాఫీలు తాగే అలవాటు కూడా వైద్యుల ఆరోగ్యం ప్రమాదంలో పడటానికి కారణాలుగా వైద్య నిపుణులు తెలిపారు.

అంతేకాకుండా.. చాలామంది డాక్టర్లు తమ హెల్త్ చెకప్స్ను పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటుంటారని, సైకలాజికల్గా కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనయి డిప్రెషన్తో ఇబ్బంది పడుతుండేది డాక్టర్లేనని చెప్పారు. ఈ ఒత్తిడిని మేనేజ్ చేయడానికి కొందరు డాక్టర్లు ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్కు అలవాటు పడి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారని వైద్యుల ఆరోగ్యంపై హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.