- స్వాగతం పలకనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ శాంతి కోసం బౌద్ధ బిక్షువులంతా ఏకమై చేపట్టిన ‘3వ దమ్మ పాదయాత్ర’ బుధవారం హైదరాబాద్ సిటీకి రానుంది. గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ యాత్ర బుధవారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్ దగ్గరున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోనుంది. ఈ దమ్మ యాత్రకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖులు పాల్గొననున్నారు.
కర్నాటకలోని సిద్దార్థ బుద్ధ విహార నుంచి మొదలైన ఈ యాత్రలో వందలాది మంది థాయ్, ఇండియన్ బౌద్ధ బిక్షువులతోపాటు గగన్ మాలిక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గగన్ మాలిక్ కూడా నడుస్తున్నారు. మొత్తం 400 కిలోమీటర్లకుపైగా నడుచుకుంటూ మార్చి1న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం చేరుకొని యాత్రను ముగించనున్నారు.
