హైటెక్ సిటీలో మూడో అంతర్జాతీయ బ్రాంకాస్-2023 సదస్సు

హైటెక్ సిటీలో మూడో అంతర్జాతీయ బ్రాంకాస్-2023 సదస్సు

హైదరాబాద్​: అత్యాధునిక చికిత్సలపై చర్చ జరపాలని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడానికి కృషి చేయాలని మంత్రి హరీశ్​ రావు  డాక్టర్లకు సూచించారు.  హైటెక్ సిటీలోని నోవాటల్ లో యశోద హస్పిటల్​ఆధ్వర్యంలో మూడో అంతర్జాతీయ బ్రాంకాస్–-2023 సదస్సు జరిగింది. ఈకార్యక్రమానికి మంత్రి హరీశ్​రావు హాజరై మాట్లాడారు. వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం, ఇతరత్రా కారణాల వల్ల చెస్ట్, లంగ్స్​డిసీజ్​లతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ తో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.

బ్రాంకోస్కోపీ, స్లీప్ ల్యాబ్, తోరకోస్కోపీ వంటి పరికరాలు ఇప్పటికే నిమ్స్, గాంధీ, ఛాతి ఆసుపత్రుల్లో రెడీగా ఉన్నాయన్నారు.  జిల్లా కో మెడికల్ కాలేజీ తేవడం వల్ల ఛాతి, ఊపిరితిత్తుల  విభాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ ట్రీట్​మెంట్​అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వేపర్ అబ్లెషన్, లంగ్ విజన్, బ్రాంకియల్ థెర్మోప్లాస్టి వంటి చికిత్సలను తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యశోద ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చిందన్నారు.