V6 News

రెండో రోజు దీటుగా బదులిచ్చిన టీమిండియా

రెండో రోజు దీటుగా బదులిచ్చిన టీమిండియా
సిడ్నీలో ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో ధీటుగా బదులిస్తోంది టీమిండియా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 338 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 96 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని మూడో టెస్ట్ ఆడుతున్న రోహిత్ శర్మ  ఒక సిక్స్, మూడు ఫోర్లతో 26 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్  50 రన్స్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పుజారా, రహనె మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సెకండ్ డే ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా. అడిలైడ్, మెల్ బోర్న్ లో ఘోరంగా విఫలమైన బ్యాట్స్ మన్  స్టీవ్ స్మిత్  సిడ్నీలో సెంచరీతో రెచ్చిపోయాడు. 131 రన్స్ తో మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. రెండు వికెట్ల నష్టానికి 166 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్… మరో 172 రన్స్ చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 91 రన్స్ చేశారు. మిచెల్ స్టార్క్ 24 పరుగులు చేయగా ముగ్గురు బ్యాట్స్ మెన్లు డకౌట్ గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీసుకోగా… బుమ్రా, సైని 2 చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్  1 వికెట్  దక్కించుకున్నాడు.