హైదరాబాద్ లో ఒక్కరోజే 4 మర్డర్లు

హైదరాబాద్ లో ఒక్కరోజే 4 మర్డర్లు

మెహదీపట్నం, లంగర్​హౌజ్​ ఏరియాల్లో దారుణం

హైదరాబాద్, వెలుగు: సిటీలో శుక్రవారం వరుస హత్యలు కలకలం రేపాయి. మెహదీపట్నం ఏరియాలోనే వేర్వేరు ఘటనల్లో నలుగురు హత్యకు గురయ్యారు. లంగర్ హౌజ్ ప్రాంతంలో రాత్రి 11.30 గంటల టైంలో నడిరోడ్డుపై రెండు హత్యలు జరిగాయి. ఓ వెహికిల్​లో వచ్చిన కొందరు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టారు. దీంతో ఒకరు చనిపోగా.. మరొకరిని వెంటపడి కత్తులతో పొడిచి చంపారు. చనిపోయిన ఇద్దరూ రౌడీ షీటర్లేనని పోలీసులు తెలిపారు. ఒకరు గోల్కొండకు చెందిన రౌడీ షీటర్  షేక్​ అహ్మద్, అతని అనుచరుడు ఫయాజుద్దీన్​గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది రెండు ముఠాలకు చెందిన వారి మధ్య గ్యాంగ్​వార్​ అని చెప్తున్నారు.

చూస్తుండంగనే చంపిన్రు

మల్లెపల్లికి చెందిన రాహుల్ అగర్వాల్(28)ను గోల్కొండ పీఎస్ పరిధిలోని అలిజాపూర్ లో శుక్రవారం ఉదయం అతడి ఫ్రెండ్ బండరాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మజర్​గా అనుమానిస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రెయిన్ బజార్‌‌లో మరొకరిని..

శుక్రవారం సాయంత్రం రెయిన్ బజార్ లోని జాఫర్ రోడ్డులో నమాజ్ కి వెళ్లి వస్తున్న ఇమ్రాన్(25)పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు పాల్పడినవాళ్లలో ప్రధాన నిందితుడు తలాబ్ మతాబ్ పీఎస్ లో లొంగిపోయాడు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

24రోజుల్లో 15మర్డర్లు

గ్రేటర్‌లో లాక్‌డౌన్‌ టైంలో తగ్గిన నేరాలు.. తిరిగి ఆంక్షల సడలింపుల తర్వాత పెరుగుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో రెగ్యులర్‌గా కేసులు ఫైల్​అవుతున్నాయి. మే 6 నుంచి సోమవారం వరకు మొత్తం 26 సూసైడ్స్, 15 మర్డర్లు, 3 అత్యాచారాలు జరిగాయి. కుటుంబ కలహాలు, పాతకక్షలే వీటికి కారణమని పోలీసులు చెప్తున్నారు. లాక్ డౌన్ టైమ్​తో జనమంతా ఇండ్లకే పరిమితమవడంతో క్రైమ్‌ రేటు 23.63 శాతం తగ్గింది. అప్పుడు 16 రేప్‌, 29 కిడ్నాప్ కేసులున్నాయి. లాక్‌డౌన్‌ రిలాక్సేషన్​తర్వాత మళ్లీ క్రైమ్‌ రేట్‌ పెరుగుతూ వస్తోంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలోనూ ఈ పరిస్థితి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్