
హైదరాబాద్ మహా నగరంలో మరో నాలుగు కొత్త లింకు రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. రో జు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకుని ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన కొత్త లింకు రోడ్ల నిర్మాణం పూర్తయింది. రేపు సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్న లింకు రోడ్ల వివరాలిలా ఉన్నాయి.
ఉదయం 10:30 గంటలకు నోవాటెల్ వెనక భాగంలోని వసంత్ నగర్ నుంచి ఎన్ ఏసీ వరకు 0.75కిలోమీటర్లు, ఐ ఎస్ బి రోడ్డు నుంచి ఓఆర్ఆర్ (1.94 కిలోమీటర్లు)-మణికొండ మూడు లింక్ రోడ్ల జంక్షన్.
ఉదయం 11:00 గంటలకు జె వి హిల్స్ పార్క్ నుండి మజీద్ బండ వరకు నిర్మించిన 1.01 కిమీ లింక్ రోడ్
ఉదయం 11:20 గంటలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఓ ఆర్ ఆర్ వరకు నిర్మించిన 1.94 కిమి లింక్ రోడ్.