లైసెన్సు లేకుండా అల్లం పేస్ట్ తయారీ

లైసెన్సు లేకుండా అల్లం పేస్ట్ తయారీ
  • 4 టన్నులు స్వాధీనం

ట్యాంక్ బండ్, వెలుగు: లైసెన్సు లేకుండా అక్రమంగా అల్లంవెల్లుల్లి పేస్ట్​ తయారుచేసి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్.మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంటిపై హైదరాబాద్ సిటీ పోలీస్, టాస్క్‌‌ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ టీములు గురువారం దాడులు నిర్వహించాయి.

నిర్వాహకుడు జసాని ఇల్యాన్ (21)ను అరెస్ట్ చేశారు. అబిడ్స్‌‌కు చెందిన ఇతను ‘జేజే ఫుడ్స్’ పేరుతో లైసెన్సు గడువు ముగిసినా అల్లం పేస్టు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 4 టన్నుల పేస్ట్, ముడి సరుకులు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.