కాలికనడకన పోలాండ్ బోర్డర్ కు మెడికల్ స్టూడెంట్లు

కాలికనడకన పోలాండ్ బోర్డర్ కు మెడికల్ స్టూడెంట్లు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ లో రష్యా దళాలు వీధి పోరాటం చేస్తున్నాయి. దీంతో ఎపుడు ఏమౌతుందోనన్న టెన్షన్‌ ఏర్పడుతోంది. దీంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో తమ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌వివ్‌లోని డాన్లొ హాలిస్కయ్‌ మెడికల్‌ యూనివర్సిటీ కి చెందిన 40 మంది విద్యార్థులు పోలండ్‌ సరిహద్దుకు చేరుకుంటున్నారు. పోలెండ్‌ సరిహద్దు నుంచి ఈ నగరం 70 కి.మీ. దూరంలో ఉంది. యూనివర్సిటీ అధికారులు 40 మంది మెడికల్‌ విద్యార్థులను బస్సులో తీసుకు వచ్చి సరిహద్దు దగ్గర దింపారు. అక్కడి నుంచి 8 కి.మీ. నడుచుకుంటూ విద్యార్థులు పోలండ్‌ సరిహద్దుకు చేరుకున్నారు.

మరో వైపు ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం రెండు విమానాలను పంపుతోంది. ఒకటి ఢిల్లీ నుంచి, మరోటి ముంబై నుంచి ఈ రాత్రి 9 గంటలకు బయలుదేరనున్నాయి.

మరిన్ని వార్తల కోసం...

ఉక్రెయిన్ ఆయుధాలు వదిలేస్తే చ‌ర్చ‌లు జ‌రుపుతాం