రెండు నెలల్లో 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు!

రెండు నెలల్లో 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు!

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలల్లో 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దయింది. రూల్స్ పాటించడంలేదని ఆ కాలేజీల గుర్తింపును నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, సరిపడా ఫ్యాకల్టీ, ఇతర సౌలతులు లేకపోవడంతో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేసినట్లు ఎన్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. మరో 100కు పైగా మెడికల్ కాలేజీల గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపాయి.

వీటిలో తమిళనాడు, గుజరాత్, అస్సాం, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లోని కాలేజీలు ఉన్నాయని పేర్కొన్నాయి. ‘‘ఎన్ఎంసీ బయోమెట్రిక్ అటెండెన్స్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూటీలో ఉన్న ఫ్యాకల్టీనే పరిగణనలోకి తీసుకుంటోంది. కానీ డాక్టర్ల డ్యూటీ టైమింగ్స్ ఫిక్స్ డ్ గా ఉండవు కదా. కొంతమంది నైట్ డ్యూటీ చేస్తుంటారు. ఈ విషయాన్ని ఎన్ఎంసీ పరిగణనలోకి తీసుకోవాలి” అని మెడికల్ ఎక్స్ పర్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు.