అప్పు ఇచ్చాడు... 11 ఏళ్ల కూతురిపై కన్నేశాడు.. చివరకు ఏమైందంటే...

అప్పు ఇచ్చాడు... 11 ఏళ్ల కూతురిపై కన్నేశాడు.. చివరకు ఏమైందంటే...

ఈ రోజుల్లో హాయిగా బతికేవాడు ఎవరంటే అప్పు లేని వాడు, చేయని వాడు. కానీ  అలాంటి వారు ఉంటారా.. అంటే కష్టమే. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేక.. అప్పులు తీసుకుని అవసరాలు తీర్చుకుంటారు. తీరా అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడి.. ఒత్తిడి పెరగడంతో ఊరి నుండి పారిపోవడమే లేదంటే అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తున్నారు.  తాజాగా ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్న పాపానికి 11 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించిన ఘటన బీహార్​లో చోటు చేసుకుంది. 

అభం, శుభం తెలియని కుమార్తెను బాకీ కింద 40 ఏళ్ల వ్యక్తికి అప్పజెప్పిన ఘటన బీహార్లోని సివాన్ జిల్లాలో చోటుచేసుకుంది.  లక్ష్మీపూర్ గ్రామంలో ఓ కుటుంబం తన దూరపు బంధువైన మహేంద్ర పాండే వద్ద 2 లక్షల రూపాయిలు  అప్పులు తీసుకుంది. అయితే అవి తీర్చకపోవడంతో అవకాశంగా తీసుకున్నాడు మహేంద్రపాండే. అయితే వారికి ఓ 11 ఏళ్ల సంధ్యా కుమారి అనే కుమార్తె ఉండగా అతడి కన్ను ఆ బాలికపై పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని, మీ బాకీ మాఫీ చేస్తానని, ఆమెను చదివిస్తానంటూ మాయమాటలతో  బెదిరించాడు. దీంతో అతడితో పంపించారు.

ఆమెను తీసుకెళ్లి మహేంద్ర పెళ్లి చేసుకున్నాడు. అయితే బాలికను ట్రాప్ చేసి తన బిడ్డను వివాహం చేసుకున్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తి మహేంద్ర పాండేను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆ బాలిక ఇందులో మహేంద్ర తప్పేమీ లేదని.. చేసిన అప్పులు తీర్చలేక తన తల్లే అతడిని పెళ్లి చేసుకోమని ఒప్పించిందని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

మహేంద్ర మాట్లాడుతూ.. తల్లి ఇష్టప్రకారమే తామిద్దరం వివాహం చేసుకున్నామని, డబ్బుల కోసం తమను బ్లాక్ మెయిల్ చేసిందంటూ తెలిపారు. కాగా, బాధితురాలు కూడా తల్లికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. అయితే మూడు నెలలుగా ఆమె అతడి వద్దే ఉండటంతో బాలికను వైద్య పరీక్షల కోసం తరలించారు. నిందితుడ్ని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు

ఈ రోజుల్లో దేనికైనా (అవసరానికైనా, పనికైనా) కావాల్సిందీ డబ్బే... మనీ లేకుంటే ఆర్థిక బాధలు, కష్టాలు మొదలవుతాయి. ఆర్థిక కష్టాలు ఎంతంటి పరిస్థితినైనా తీసుకు వస్తాయి. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేక.. అప్పులు తీసుకుని అవసరాలు తీర్చుకుంటారు. తల తాకట్టు పెట్టైనా రుణాన్ని తీర్చేయాలనుకుంటారు. తీరా అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడి.. ఒత్తిడి పెరగడంతో ఊరి నుండి పారిపోవడమే లేదంటే అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తున్నారు. అలా ఓ కుటుంబం అప్పులు తీసుకుని.. కట్టలేని పరిస్థితికి వచ్చింది. తీరా కుమార్తెను బాకీ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.