పంజాబ్లో భూకంపం.. భయాందోళనలో జనం

పంజాబ్లో భూకంపం.. భయాందోళనలో జనం

పంజాబ్ను భూకంపం వణికించింది. ఢిల్లీలో ప్రకంపనలు నమోదైన మరుసటి రోజే పంజాబ్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 3.42గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదైంది. అమృత్సర్కు 145 కిలోమీటర్ల దూరంలో భూమికి 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది.

ఉత్తర భారతంలో ఈ మధ్యకాలంలో వరస భూకంపాలు జనాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత వారంలో రెండుసార్లు భూమి కంపించింది. ఈ నెల 9న నేపాల్ కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది. ఈ నెల 12న నేపాల్లో మరోసారి 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇదే సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ నెల 1న మధ్యప్రదేశ్​లో 3.9 తీవ్రతతో భూమి కంపించింది.