కిలో గన్ పౌడర్ 45 రూపాయలు

కిలో గన్ పౌడర్ 45 రూపాయలు

హైదరాబాద్: ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు కిరాణా సరుకుల్లా మారాయి. సౌత్ జోన్ పరిధిలో గన్ పౌడర్ ను స్టోర్ చేసి  అమ్మకాలు చేస్తున్నవైనం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. గన్ని బ్యాగుల్లో పెట్టి మరీ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కరీంనగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు  అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా గన్ పౌడర్ దొరికింది. దీంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఎక్కడి నుంచి తెచ్చారని అడిగితే షబ్బీర్, హమీద్ ఖాన్ అనే ఇద్దరు గన్ పౌడర్ సప్లై చేస్తున్నట్లు చూపించారు. వీరికి గతంలో లైసన్స్ ఉండేది, కానీ లైసన్స్ ను క్రాస్ చేసి అమ్మకాలు చేశారు. గత రెండేళ్లుగా లైసన్స్ రిన్యువల్ చేయలేదని పోలీసులు గుర్తించారు. కరీంనగర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కు 45 రూపాయలు కిలో గన్ పౌడర్ ను అమ్మకాలు చేసింది వీరేనని నిర్ధారించుకుని అరెస్టు చేశారు. వీరు గ్రైనైట్ క్వారీ లో ఈ గన్ పౌడర్ ను వాడుతున్నట్లు తేలింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని,  కేసు విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో 34 గన్ని బ్యాగులను, సోడియం నైట్రేట్9, సల్ఫేర్2 ను సీజ్ చేశామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

అలంపూర్ సరిహద్దులో పోలీసుల తనిఖీలు.. హైదరాబాద్ కారులో 30 లక్షలు పట్టివేత

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల