హైదరాబాద్ లో వీకెండ్ స్పెషల్ డ్రైవ్.. 460 మంది తాగి దొరికిండ్రు

హైదరాబాద్ లో  వీకెండ్ స్పెషల్ డ్రైవ్.. 460 మంది తాగి దొరికిండ్రు

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 12, 13 తేదీల్లో నగరవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రంక్​అండ్ డ్రైవ్​లో 460 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 350 మంది టూ వీలర్, 25 మంది త్రీ వీలర్, 85 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు ఉన్నారు. నలుగురిలో అత్యధికంగా 300 బీఏసీ లెవల్స్ నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్టు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు.