వైద్య సేవల కోసం 466 కొత్త వాహనాలు.. ఆగస్టు 1నుంచే అందుబాటులోకి

వైద్య సేవల కోసం 466 కొత్త వాహనాలు.. ఆగస్టు 1నుంచే అందుబాటులోకి

రాష్ట్రంలో వైద్య వ్యవస్థ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడనుంది. ఆగస్టు 1నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలో కొత్తగా 466 ప్రభుత్వ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో 204 అంబులెన్స్ లు, 228 అమ్మ ఒడి, 34 ఇతర వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే ఇవి రాష్ట్రానికి చేరుకున్నాయి. 

కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాలో మెడికల్​ కాలేజీలు ఏర్పాటు చేస్తూ అత్యుత్తమ వైద్యాన్ని పబ్లిక్ కి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.