యాప్తో యూరియా సప్లై సులభతరం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

యాప్తో యూరియా సప్లై సులభతరం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు : యూరియా పంపిణీని సులభతరం చేసేందుకే ప్రభుత్వం ప్రత్యేక మొబైల్​యాప్​ను తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్​లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. యాప్​పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల కోసం షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఎరువులు తీసుకోవచ్చన్నారు. భూ విస్తీర్ణాన్ని బట్టి యూరియాను బుక్​ చేసుకోవచ్చన్నారు.  రైతులు యాప్​ను డౌన్​లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లా వ్యవసాయ అధికారి మోహన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆస్తుల సెటిల్మెంట్ కోసం ప్రచారం.. 

క్లయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.   మీ  డబ్బు మీ హక్కు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రచారం చేస్తామన్నారు. ఆన్​క్లయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై  హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు,  ఆర్థిక సంస్థలను సంప్రదించి నిధులను క్లయిమ్​ చేసుకోవాలన్నారు.  

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  నాబార్డు డీడీఎం   ప్రవీణ్​కుమార్,  ఎన్డీసీసీ బ్యాంక్ జీఎం అనుపమ, ఎల్డీఎం చంద్రశేఖర్,  కెనారా బ్యాంక్ డీఎం మనీష్​ సైనీ, ఎస్ఎల్​బీసీ ప్రతినిధి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

క్రీడాకారులకు ఆర్థిక సాయం 

వివిధ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జిల్లా క్రీడాకారులకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం అందజేశారు. అథ్లెటిక్స్​లో గోల్డ్​ మెడల్స్ సాధించిన గోతి పరశురాం,  కిన్నెర ఆనంద్,  మాలవత్ ఈశ్వర్​లకు రూ.25వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి సాధించిన విజయాలు జిల్లాలోని యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి జిల్లాలో మరింత శ్రద్ధ తీసుకుంటామన్నారు.  జిల్లా క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్​గౌడ్,  అథ్లెటిక్స్ అసోసియేషన్​ జిల్లా ప్రెసిడెంట్ జైపాల్​రెడ్డి,  సెక్రటరీ అనిల్ పాల్గొన్నారు.