స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటల్లో రాణించాలి : ఏజీఎం శ్రీనివాస్ రావు

స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటల్లో రాణించాలి : ఏజీఎం శ్రీనివాస్ రావు

తూప్రాన్, వెలుగు : స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటల్లో రాణించాలని  శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం స్కూల్ లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్ కు చిన్నతనం నుంచే ఆటల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. క్రీడల వల్ల  శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను వస్తాయన్నారు రామకృష్ణారావు, కో ఆర్డినేటర్ రవి, సోమేశ్, డీన్ అశోక్ రెడ్డి  పాల్గొన్నారు.