యాదగిరిగుట్ట ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదగిరిగుట్ట ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(డిసెంబర్21)స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలతో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి మూడు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారు జామునుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. మాడ వీధులు, ప్రసాదం కౌంటర్లు,  క్యూ కాంప్లెక్స్ లు కిటకిటలాడదుతున్నాయి.  సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.