నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద ఆక్రమణల తొలగించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం నగర శివారులోని బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించి మాట్లాడారు. మూలమలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, వంకర టింకర నిర్మాణాలను సరిచేయాలన్నారు. రోడ్ల మధ్య కరెంట్ పోల్స్ ఉంటే తొలగించాలన్నారు. యాక్సిడెంట్స్ జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు పెట్టాలన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, ప్రైవేట్ వెహికల్స్, ఆపరేటర్లు రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా స్టేట్‌లో 20వ స్థానంలో ఉందని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అడిషనల్కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఇంజినీర్ ప్రవీణ్, హర్ష తదితరులు ఉన్నారు. తరువాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు.
డీసీసీబీలో కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్, వెలుగు: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి శనివారం చార్జ్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించగా బ్యాంక్ సీఈవో నాగభూషణం వందే పూలబొకేతో స్వాగతం పలికారు.
