బాల్కొండ, వెలుగు : శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం భీంగల్ మండల కేంద్రంలో 69వ ఎస్జీఎఫ్ గేమ్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ క్రీడా నిర్వాహణ కోసం నిధులు వెచ్చించిందని, కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని సూచించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని క్రీడాపోటీల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల స్టూడెంట్స్ మార్చ్ ఫాస్ట్తో ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
