సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళ సంఘాల బలోపేతం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సెర్ప్ కార్యకలాపాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో శ్రీనిధి రుణాల రికవరీపై ఏపీఎంలు, సీసీలు ఉదాసీనత వైఖరిని విడనాడి రికవరీపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల రికవరీ వసూలు 100 శాతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్య, అడిషనల్ డీఆర్డీవో సుధీర్, శ్రీనిధి రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
